ఈ వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా బలహీనపడి రికార్డుగా మారింది. నిన్న అంటే శుక్రవారం, 11 అక్టోబర్ 2024, డాలర్‌తో రూపాయి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది.
ఎటువంటి ఖరీదైన వస్తువులైన సరే.. మనం ధనవంతుల ఇంట్లో చూస్తుంటాము. ధనవంతులు ఎక్కువగా బంగారం, వెండి, వజ్రాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇక రాజుల కుటుంబాలు అయితే మాత్రం.. ప్యాలెస్ అంటూ పెద్ద పెద్ద భవంతులలో అత్యంత విలువైన, అలాగే ఖరీదైన వస్తువులను ఉంచుకోవడం వారి పరిపాటి. పురాతన కాలం సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు ప్రపంచ మార్కెట్లో కొన్ని వేలానికి తీసుకువస్తుంటారు. ఇకపోతే ఓ ప్యాలెస్ లో ఉన్న బంగారు టాయిలెట్ కు కూడా ఇలా…
Rs.2000 Note: రూ.2000నోట్ల చెలామణిని ఆర్బీఐ రద్దు చేసింది. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం 2016లో 500, 1000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కాలానికి ప్రజలు పెద్ద నోట్ల రద్దు అని పేరు పెట్టారు. నోట్ల చలామణిని ఆపేందుకు ఈసారి కూడా ఇదే పేరు పెట్టారు.
Indian Currency Look: ప్రస్తుతం మన కరెన్సీ నోట్ల పైన ఒక వైపు జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ, మరోవైపు చారిత్రక కట్టడాల బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్ల లుక్ భవిష్యత్‌లో మారనుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు ప్రతిరూపంగా పూజించే లక్ష్మీదేవితోపాటు కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే గణేషుడి బొమ్మలు వస్తాయా అని ప్రజలు అనుకుంటున్నారు.
IT Slow Growth: మన దేశం చేస్తున్న ఏకైక అతిపెద్ద ఎగుమతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసులు. విదేశీ మారకానికి కూడా ఇదే కీలకమైన సోర్స్. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈ మధ్య ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. దీంతో ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది.
Russia will buy Rupees: డాలర్లను, యూరోలను కొనే పరిస్థితి లేకపోవటంతో మిత్ర దేశాల కరెన్సీలను కొనాలని రష్యా భావిస్తోంది. ఇండియా, చైనా, టర్కీ కరెన్సీలైన రూపాయి, యువాన్, టర్కిష్ లిరాలను కొనుగోలు చేయాలనుకుంటోంది. నేషనల్ వెల్త్ ఫండ్ (ఎన్‌డబ్ల్యూఎఫ్) కోసం ఈ నిధులను
మనం రోజు వాడే ఇండియన్ కరెన్సీ నోట్లలో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. మనం అందరం ఇండియన్ కరెన్సీని రోజు వినియోగిస్తుంటాం. అయితే.. కరెన్సీ నోట్లపై సింబల్స్ ఉంటాయి. అయితే అవి ఎందుకు ఉన్నాయని మీకు తెలుసా..? కళ్ళులేనివారు ఈ సింబల్స్‌ను బట్టి కరెన్సీ విలువ ఎంతని ఈజీగా గుర్తించడానికి ఈ సింబల్స్‌ను ప్రింట్ చేస్తుంటారు. అంధులు ఈ సింబల్స్‌పై వేలును పెట్టి ఆ…
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,…