R Krishnayya: తెలంగాణ రాష్ర్టంలోని బీసీ కులాల్లోని అన్ని కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అన్ని కులాల వారీకి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీలో ఉన్న 130 కులాలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read also: Gmail feature: జీమెయిల్‌లో మరో ఫీచర్.. ఇక మీదట వెతకడం ఈజీ..
తెలంగాణ రాష్ట్రంలో కేవలం 6 కులాలకు చెందిన వారికి మాత్రమే రూ. లక్ష ఆర్థికసాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. ఈ నేపథ్యంలో మిగిలిన కులాలకు చెందిన వారు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీల్లో ఉన్న 130 కులాల వారీకి కూడా రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలన్నారు. బీసీలకు బీసీ బంధు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారని కానీ.. ఇప్పటి వరకు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.
Read also: Health: అశ్వగంధం మానవునికి అన్ని లాభాలు చేస్తుందా.. చివరకు దానికి కూడానా..!
ధనిక రాష్ట్రమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని బీసీలకు కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. బీసీలకు కొత్త రుణాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కూడా కలిశామన్నారు. ప్రస్తుతం ఆరు కులాలకు ఇస్తున్నామని.. . తరవాత మిగితా కులాలకు ఇస్తామని మంత్రి చెప్పారన్నారు. ఉన్నత చదువులు చదివే బీసీ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుపేదల పెళ్లికి ఆర్ధిక సాయం రూ. లక్ష ఇస్తున్నారని.. కానీ కులాంతర(ఇంటర్ కాస్ట్ ) వివాహం చేసుకునే వారికి మాత్రం కేవలం రూ. 10వేలు ఇస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఏపి లో కులాంతర వివాహానికి రూ. 2 లక్షల ఆర్ధిక సహాయం ఇస్తోందని ఎంపీ గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు. బీసీ సంక్షేమ శాఖ లో అధికారులు సరిగా లేరని.. ముఖ్యమంత్రి పేషిలో కూడా అదే విధంగా ఉందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.