రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది.
CM Revanth Reddy : రాష్ట్రంలో చేపట్టిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని, ఇది తెలంగాణకు ఒక మెగా హెల్త్ చెకప్‌లాంటిదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధనలో ఈ కులగణన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కులగణనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ, 300 పేజీల నివేదికను సిద్ధం చేసి ఎంసీహెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి సమర్పించింది. Murder :…
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోమారు బీసీల గురించి చర్చను లేవనెత్తారు. తాజాగా మంత్రి బీసీల విషయమై స్పందిస్తూ.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా.. అలాగే అనేకమంది బీసీ సీనియర్ నేతలు ఉన్నా సరే.., అలాగే బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి…
Bandi Sanjay Kumar: గోదావరి ఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నక్సల్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కులగణన తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు. వారు దశాబ్దాలుగా నక్సల్స్ పక్షాన నిలబడి, అమాయకుల చావులకు కారణమైన విధానాలకు…
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు." కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం.
Srinivas Goud : పీవీ మార్గ్ లోని నీరా కేఫ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించుకు పోతున్న కుల వృతులను కాపాడాలని నాటి ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించారని, మీ కుల వృత్తిని కాపాడమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. నీరా పాలసీ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఆరోగ్య కరమైన నీరా పానీయం అందించే లక్ష్యం చేసిందన్నా శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రొడక్ట్స్…
KTR : కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో…
R.Krishnaiah : పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం కాదు, చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన 14 బిసి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ…. పంచాయతీరాజ్…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పారదర్శకంగా, శాస్త్రీయంగా కుల గణన సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వే పూర్తిగా సమగ్రంగా, జాతీయ ప్రామాణికాలతో నిర్వహించబడుతోందని, అందుకు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించారని తెలిపారు. మొత్తం…
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్…