Palvai Sravanthi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ అధిష్టానానికి పెద్ద నేత షాక్ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ రాకపోవడంతో పాటు అంతర్గత విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫలితాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఓటమికి గల కారణాలు, జరిగిన తప్పులపై చర్చించారు. కేవలం డబ్బు, మద్యం పంచి అధికారపార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని స్రవంతి ఆరోపిస్తున్నారు.
అనుకున్న మెజార్టీ రావడం లేదంటూ మునుగోడు బరిలో వున్న అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అసహనం వ్యక్తం చేస్తూ కౌంటర్ సెంటర్ నుంచి వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది.
ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తిష్టవేరు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్ నడుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ 30శాతం ఓటింగ్ నమోదైంది. లంచ్ టైం కావడంతో పోలింగ్ తగ్గింది. క్యూలలో మహిళా ఓటర్లే కీలకంగా మారింది.
మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
టీఆర్ఎస్ అభ్యర్థికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి మద్దతు ఇచ్చినట్లు కొంత మంది పోస్టులు పెట్టారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.