ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కొద్దిసేపటికి క్రితమే ప్రత్యూష పోస్టమార్టం జరిగింది. విష వాయువు పీల్చడం వల్ల శ్వాస ఆగిపోయి చనిపోయినట్టు డాక్టర్ల ప్రిలిమినరీ ఒపీనియన్ వెల్లడించారు. పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు బాడీ అపోలోకి తరలించారు.
అయితే.. రేపు హైద్రాబాద్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీతో బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘ప్రత్యూష్య.. చాలా కాలంగా డిప్రెషన్ లో వున్నట్టు గుర్తించాము.. సూసైడ్ నోట్ లభించింది.. ప్రత్యూష తండ్రి 100 కు కాల్ చేస్తే..మేము ఇంటికి వెళ్ళాము.. బాత్రూమ్ లో కెమికల్ రసాయనాలు సేవించి .. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నాము’ అని ఆయన ఎన్టీవీకి తెలిపారు.