Sonu Sood :16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి.. సోను సూద్ సంచలన డిమాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో విలన్‌గా మెప్పించినా, నిజజీవితంలో మాత్రం వేలాది మందికి సాయం చేస్తూ ‘రియల్ హీరో’గా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు సోనూ సూద్. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వేల మైళ్ల దూరం నడిచి వెళ్తున్న వలస కూలీలను సొంత ఖర్చులతో వారి ఇళ్లకు చేర్చి ‘కలియుగ కర్ణుడు’ అనిపించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా విద్య, వైద్య రంగాల్లో ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. సమాజంలో జరిగే ఏ అన్యాయం పైనైనా ధైర్యంగా స్పందించే సోనూ సూద్, తాజాగా ఘజియాబాద్‌లో జరిగిన విషాద ఘటనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Also Read : sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసలైన ముగ్గురు మైనర్ సోదరీమణులు, 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన నటుడు సోను సూద్, సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంటూ ప్రభుత్వాలకు.. తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు.. ‘పిల్లలు వర్చువల్ ప్రపంచంలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడం భరించలేని విషయం’ అని ‘మన బాల్యానికి మార్గదర్శకత్వం (Guidance) అవసరం, అల్గారిథమ్స్ కాదు’ అంటూ సోనూ సూద్ అన్నారు.
అంతే కాదు ‘చదువు కోసం తప్ప, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా.. ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లు పిల్లల చేతిలో ఆయుధాలుగా మారుతున్నాయి, వాటి వినియోగంపై నియంత్రణ లేకపోతే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ, వారికి సోషల్ మీడియా కంటే కుటుంబంతో గడిపే సమయం ఎక్కువ అవసరమని వారికి గుర్తుచేయాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Social media can wait. Childhood can’t. 🙏 pic.twitter.com/KByJ38D1oS
— sonu sood (@SonuSood) February 4, 2026
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!