Honda Dio 125 X-Edition: స్పోర్టీ లుక్, ఆధునిక TFT డిస్‌ప్లే.. హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్ రిలీజ్..
- హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్ రిలీజ్
- స్పోర్టీ లుక్, ఆధునిక TFT డిస్‌ప్లే
- ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీ): రూ.87,733
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఇటీవల భారత మార్కెట్‌లో డియో 125 X ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఇది డియో 125 సిరీస్‌లోని స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌గా అట్రాక్ట్ చేస్తోంది. యువతను ఆకర్షించేలా బోల్డ్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, స్పోర్టీ లుక్‌తో ఈ స్కూటర్ వచ్చింది. సిటీ రైడింగ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ మోడల్ గురించి వివరంగా తెలుసుకుందాం. డియో 125 X ఎడిషన్ సాధారణ మోడల్‌ల కంటే చాలా స్పోర్టీగా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్.. Pearl Siren Blue, Pearl Deep Ground Grey కాంబినేషన్ తో వస్తోంది. ఎక్స్‌క్లూసివ్ X-ఎడిషన్ గ్రాఫిక్స్ & డైనమిక్ డెకల్స్ బాడీ ప్యానెల్స్‌పై అందించారు. వైబ్రెంట్ ఆరెంజ్/మ్యాట్ ఫ్రెష్ కలర్ అల్లాయ్ వీల్స్ రోడ్డుపై ఐ ఫీస్ట్‌గా నిలుస్తాయి. స్పోర్టీ ఫ్రంట్ అప్రాన్, షార్ప్ లైన్స్‌తో యూత్‌ఫుల్ అప్పీల్ ఎక్కువ.
Also Read:Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ఈ స్కూటర్ రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా రెండుసార్లు చూసేస్తారు. అంత బోల్డ్ & స్టైలిష్. ఇంజిన్ విషయంలో మాత్రం సాధారణ డియో 125తో ఒకేలా ఉంది. నమ్మకమైన, ఎఫిషియంట్. ఇంజిన్.. 123.92 cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, PGM-FI (ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్). 8.19 bhp (సుమారు 8.3 PS) @ 6500 rpmతో శక్తినిస్తుంది. 10.5 Nm @ 5000 rpm టార్క్ ను రిలీజ్ చేస్తుంది. సుమారు 47-50 kmpl (రియల్-వరల్డ్ యూజ్‌లో) మైలేజ్ ను ఇస్తుంది. ఇడ్లింగ్ స్టాప్ సిస్టమ్.. ట్రాఫిక్‌లో ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది.
సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ పికప్, లైట్‌వెయిట్ (105 kg కెర్బ్ వెయిట్) కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. X ఎడిషన్ ప్రధానంగా స్టైల్ ఫోకస్‌తో వచ్చినా, టాప్-స్పెక్ H-Smart వేరియంట్ బేస్‌గా ఉండటంతో అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ TFT డిజిటల్ మీటర్, క్రిస్ప్ విజువల్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ (కాల్స్, SMS అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్). USB Type-C చార్జింగ్ పోర్ట్.. మొబైల్ ఛార్జింగ్ సులభం. డబుల్ లిడ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్.. స్కూటర్ దిగకుండానే పెట్రోల్ పోసుకోవచ్చు.
Also Read:Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్
ఫ్రంట్ పాకెట్ & రిట్రాక్టబుల్ పిలియన్ ఫుట్‌స్టెప్. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ – సేఫ్టీ ఫీచర్. డిస్క్ బ్రేక్ (ముందు), ట్యూబ్‌లెస్ టైర్లు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీ): రూ.87,733. ఇది స్టాండర్డ్ వేరియంట్ (రూ.86,733) కంటే కొంచెం ఎక్కువ, కానీ H-Smart (రూ.91,683) కంటే తక్కువ. మంచి మైలేజ్‌తో సిటీ రైడింగ్‌కు సూపర్. రోజువారీ ఉపయోగానికి నమ్మదగిన హోండా క్వాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!