Etela Rajender : మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా స్ట్రీట్ ఫైట్ రాదు అని, మీదికి ఒక మాట, లోపల మరో మాట మాట్లాడటం నాకు అలవాటు లేదన్నారు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు అని ఆయన అన్నారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి, వాటిని తట్టుకున్నా. 2021 నుండి BRS లో నరకం అనుభవించా. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే.. శత్రువుతో నేరుగా కోట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం రాదు. సైకో, శాడిస్ట్ ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశాడో.. బీ కేర్‌ఫుల్ బిడ్డా అంటూ తన అనుభవాన్ని స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. “హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS కి 53 వేల మెజార్టీ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో నాకు తెలుసు,” అని హుజురాబాద్ తన బలమైన కోట అని పేర్కొన్నారు.
Wife Kills Husband: బావతో వివాహేతర సంబంధం, భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య..
అలాగే, “కార్యకర్తల ఆవేదన అర్థమైంది. కార్యకర్తలకు రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తా,” అని చెప్పారు.
తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, “పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. కార్యకర్తలు కుంగిపోవద్దు. హుజురాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని గెలిపించుకుంటా,” అని స్పష్టం చేశారు.
అదే విధంగా, “కొత్త, పాత వాళ్లు అనే భావన లేదు. ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు.. వారి గురించి బాధపడకండి. కురుస స్వభావులు.. మిమ్మల్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు,” అని వ్యాఖ్యానించారు.