EX Minister Sailajanath: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు ఉపన్యాసం హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1996, 99 ఎన్నికల సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబుదే.. 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించిన ఘనుడు కూడా చంద్రబాబే.. హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగిన విషయం తెలుసుకోండి అని సూచించారు. హంద్రీనీవాను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు అని శైలజానాథ్ అన్నారు.
Read Also: Tamil Nadu: తమిళనాడులో అరుదైన నల్ల చిరుత ప్రత్యక్షం
ఇక, నారా చంద్రబాబు నాయుడి అబద్ధాలు పీక్ స్టేజ్ కి చేరాయని వైసీపీ నేత శైలజానాథ్ తెలిపారు. ఇంకొన్నాళ్ళకి భారతదేశాన్ని, ఐరోపాను నేనే కనిపెట్టానని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనంతా గ్రాఫిక్స్ మయం అన్నారు. వైసీపీ నేత శైలజానాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.