Mallu Bhatti Vikramarka: ఈ నెలాఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా మోటమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భట్టి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా కమ్యూనిస్టులు, తెలుగుదేశం శ్రేణులు కదిలివచ్చారు. మహిళలు మంగళ హారతులతో భట్టి కి స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో పెద్ద పాల్గొన్న మహిళలు, యువత, రైతులు భట్టి జిందాబాద్…. భట్టి సీఎం అంటూ నినాదాలు చేశారు. నీ వెంటే మేమున్నామంటూ వృద్ధులు భట్టికి భరోసా ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోటమర్రి అంకమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్క పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన భట్టి విక్రమార్క హస్తం గుర్తుపై ఓటు వేయాలని సిపిఐ, తెలుగుదేశం నేతలు ఓటర్లకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రచార సభలో భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్ కేటీఆర్ కు బుద్ధుండాలన్నారు. కాంగ్రెస్ హామీల అమలుకు నిధులు లేకుంటే.. బిఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.
Read Also:Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. పరిశీలనకు మంత్రులు కేటీఆర్, తలసాని
ఎవరిని మోసం చేస్తారు? ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ప్రజలను మోసం చేయడం బిఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. చేసేదే చెప్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పాలకుల దోపిడీ అరికడితే చాలు. పరిపాలన అనుభవం కలిగిన మాకు ఆరు గ్యారంటీలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలుసన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని 10 ఏళ్లుగా ఇందిరమ్మ ఇల్లు కూడా రాకుండా చేసిన కేసీఆర్.. దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. మోటమర్రి గ్రామం నుంచి మధిర వరకు ఉన్న రోడ్డును విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవిందపురం నుంచి మోటమర్రి వరకు ఉన్న డొంక రోడ్డును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో బి.టి రోడ్డుగా మారుస్తానని హామీ ఇచ్చారు.
భట్టి సమక్షంలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో బోనకల్ మండలం మోటమర్రిలో బిఆర్ఎస్ మండల నాయకులు మోదుగు మారతమ్మ, కన్నెపోవు నాగేశ్వరరావు, మోదుగు కృష్ణమూర్తి, వల్లపు కనకయ్య, వల్లపు ఆనసూర్య, ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి గ్రామానికి విచ్చేసిన భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా భట్టి ఆహ్వానించారు.
Read Also:Nakka Anand Babu: ఇసుక టెండర్ల ద్వారా మరో పెద్ద కుంభకోణం..!