తెలంగాణలో ఇంటర్ పరీక్ష తేదీలను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. ఇంటర్ పరీక్షలు ఖరారు కావడంతో ఎంసెట్ పరీక్షల నిర్వహాణపై ప్రస్తుతం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. దీనికోసం ఉన్నత విద్యామండలి సెట్ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదికను బట్టి పరీక్షల నిర్వహణ ఉండే అవకాశం ఉంది. అయితే, జూన్ రెండో వారంలో ఎంసెట్ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Read: ముంబైవాసులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరి నెలాఖరు నుంచి…
జూన్ రెండోవారం నుంచి జులై వరకు రాష్ట్రంలోని అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి ప్రణాళికలు చేస్తున్నది. కామన్ ఎంట్రన్స్ పరీక్షలు పూర్తిచేసి ఆగస్ట్ చివరి వరకు అడ్మీషన్స్ ప్రక్రియ ఒకటి, రెండు ఫేజ్‌లు పూర్తిచేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఎంసెట్‌కి సంబంధించి 70 శాతం సిలబస్, అర్హత మార్కులు సడలింపు, వెయిటేజ్ తొలగించడంపై ప్రభుత్వం నుంచి క్లారిటీని తీసుకోనున్నది ఉన్నద విద్యామండలి.