Do not exceed 30: నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. కారు చక్రాల కింద పడి చిన్నారి మృతి, బైక్ ఢీ కొని బాలుడి దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు ఇలాంటి హృదయవిదారకర వార్తలు మనం తరచూ చూస్తుంటాం. యుద్ధాలలో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎందరికో గుండెకోతను మిగిల్చే ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ నడుంబిగించింది. ప్రయాణం కాకూడదు ప్రాణాంతకం అంటూ ప్రాణం విలువ తెలియజేస్తూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. కాలనీల్లో స్పీడ్ లిమిట్‌ను ఏర్పాటు చేసి, ఉల్లంఘనలపై కొరడాఝుళిపిస్తూ భద్రమైన ప్రయాణానికి బాటలు వేస్తూ భాగ్యనర వాసులకు జీహెచ్‌ఎంసీ రోడ్డు భద్రతను కల్పిస్తుంది.
Read also: IND Vs NZ: ఓపెనర్‌గా సూర్యకుమార్.. కివీస్‌కు చుక్కలు చూపిస్తాడా?
ఇక గ్రేటర్ కాలనీల్లో రయ్ రయ్ మంటూ మంటూ దూసుకుపోతామంటే కుదరదంటున్నారు అధికారులు…కచ్చితంగా వేగ నియంత్రణ పాటించాల్సిందే. లేదంటే ప్రత్యేక తనిఖీలతో ఉల్లంఘనులపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టనుంది. దీంతో.. జీహెచ్‌ఎంసీ, పోలీస్, రవాణాశాఖ సంయుక్తంగా కలిసి గ్రేటర్ రహదారులపై వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో కాలనీ రోడ్డులో కారు, బైక్‌లు, ఇతర వాహనాలన్నీ వేగం గంటకు 30 కిలోమీటర్ల మేర మాత్రమే ఉండాలని సూచించారు. ఇక.. ప్రధాన రహదారులపై వేగ నియంత్రణ చర్యలు చేపడుతూనే కాలనీ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. ఇక.. గ్రేటర్‌లో 4,800లకు పైగా ఉన్న కాలనీల్లో ప్రతి కాలనీలో వేగ నియంత్రణ సూచిక బోర్డులను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్నది. ఈనేపథ్యంలో.. ఇప్పటి వరకు 600లకు పైగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని, అన్ని కాలనీల్లో వేగ నియంత్రణ బోర్డులు పెడతామని అధికారులు స్పష్టం చేశారు.
Delhi Girl Shraddha Walker Case Live: డేటింగ్ యాప్ లో మహిళలతో పరిచయాలు