దేశరాజధాని ఢిల్లీలో శ్రద్ధ వికాస్ వాకర్ మర్డర్ సంచలనం రేపింది. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావా ఆమెని మర్డర్ చేసి శరీరాన్ని 35 ముక్కలు చేయడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. డేటింగ్ యాప్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకోవడం, వారిని రూం కి తేవడం అఫ్తాబ్ నిత్యకృత్యంగా మారింది.