BJP National Vice President DK Aruna Fired on CM KCR.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని, కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదని ఆమె అన్నారు. తెలంగాణపై కేంద్రానికి వివక్ష లేదు… అన్ని విధాలుగా సహకరించిందని, కుట్ర పూరితంగా కేంద్రాన్ని విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావో కేసీఆర్ ముందు వాటిని నెరవేర్చు అంటూ ఆమె సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఏ గడ్డయిన తినేందుకి కేసీఆర్ సిద్ధమని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఈయన ఇచ్చిన హామీలకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేస్తుండు అని, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం కేసీఆర్‌కి నిద్ర లేకుండా చేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ నువ్వు రాకముందే అభివృద్ధి చెందిందని, కేసీఆర్ వచ్చాక తెలంగాణ అభివృద్ధిని పండపెట్టాడన్నారు. కేసీఆర్ పై భ్రమలు తొలిగిపోయాయని, కేసీఆర్ ది ఓట్ల రాజకీయమని ఆమె అన్నారు.
కాశ్మీర్ ఫైల్స్ కి బీజేపీ కి ఏమి సంబంధం అని, మునవార్ ఫారూఖీ లాంటి హిందు సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళను స్వాగతిస్తామంటున్నారు మీది ఏ సంస్కృతి అని ఆమె ప్రశ్నించారు. చాలా దేశాల జీడీపీ తగ్గితే మన దేశంలో జీడీపీ పెరిగిందన్నారు. దేశాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారన్నారు. నిరుద్యోగంలో దేశంలో 6వ స్థానంలో తెలంగాణ ఉందని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ జాతీయ ఉపాధి నిధుల కింద నిర్మించిన సీసీ రోడ్ల క్వాలిటీని చెక్ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టీఆర్ కార్యకర్తల కోసమే సీసీ రోడ్లు అని, తెలంగాణ లో ప్రభుత్వ భూములు ఉండకుండా కేసీఆర్ చేస్తుండని ఆమె ధ్వజమెత్తారు.