Director Krish: హైదరాబాద్ లో సంచలం సృష్టించిన రాడిసన్ డ్రక్స్ కేసులో రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారనే వార్తలు రావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఒక్కొక్కొరి వద్ద కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ కేసులో అబ్బాస్ అలిని అదుపులో తీసుకున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుపడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. డైరెక్టర్ క్రిష్ పై పోలీసుల నోటీసులు జారీచేశారు. అయితే ఈ వార్తలతో క్రిష్ పరారీలో వున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. తను పలుకారణవల్ల హైదరాబాద్ కు దూరంగా వున్నానని త్వరలోనే హాజరు అవతానని క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం మాదాపూర్ డీసీపి ఆఫీసులో డైరెక్టర్ క్రిష్ వచ్చారు. డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరైనట్లు సమాచారం. పోలీసుల నోటీసులకు స్పందించిన క్రిష్ పోలీసుల ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావడంతో పరారీలో వున్నట్లు వచ్చిన వార్తలను చెక్ పెట్టారు. అక్కడకు వచ్చిన క్రిష్ ను డ్రగ్స్ టెస్ట్ ల కోసం సాంపిల్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రిష్ బ్లడ్, యూరిన్ సాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపారు. ఇప్పటికే క్రిష్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చాయని పోలీసులు తెలిపారు. డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చిన విట్నెస్ కింద మరోసారి పోలీసులు విచారణకు పిలవనున్నారు.
Read also: Jagtial Tragedy: గుండెపోటుతో కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్ మృతి..!
రాడిసన్ డ్రక్స్ కేసులో నిందితుల సంఖ్య ఇప్పటివరకు 14కు చేరిన విషయం తెలిసిందే.. అయితే.. వీరందరిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అరెస్టై రిమాండ్ లో ఉన్న అబ్బాస్ అలికి డ్రగ్స్ సరఫరా చేసిన మిర్జా వాహిద్ బేగును గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మిర్జా వాహిద్ బేగు అరెస్టుతో నిందితుల సంఖ్య 14కు చేరింది. కొకైన్ ఎక్కడి నుండి తీసుకువచ్చాడో మిర్జా పోలీసులకు తెలిపాడు. రాణిగంజ్ కు చెందిన డ్రగ్ పెడ్లర అబ్ధుల్ రహ్మాన్ నుండి కొకైన్ తీసుకొచ్చినట్లు చెప్పిన మిర్జా. దీంతో నిందితుల లిస్టులో అబ్దుల్ రహమాన్ పేరు చేర్చిన పోలీసులు. డ్రగ్ పెడ్లర్ అబ్ధుల్ రహమాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అబ్ధుల్ రహమాన్ చిక్కితే నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు పోలీసులు. ఇప్పటి వరకు నిందితుల లిస్ట్ లో 9 మంది కన్జ్యూమర్లు కాగా మిగిలిన నలుగురు కొకైన్ సరఫరా చేసిన వారు, మరొకరు వివేకానంద డ్రైవర్ గా గుర్తించారు. ఇప్పటి వరకు పోలీసుల అరెస్టు చేసి బెయిల్ పాందిన వారు ముగ్గరు కాగా.. మరో ఇద్దరు పోలీసు విచారణకు హాజరయ్యారు. వారం రోజులు అవుతున్నమరో నలుగురు నిందితులు నీల్, సందీప్, శ్వేత, లిసిలు జాడ లేకపోవడం సంచలనంగా మారింది.
Abraham Ozler : ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..