Bengaluru Blast : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం (మార్చి 1) పేలుడు సంభవించింది. కేఫ్‌లో ఉంచిన పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగ్‌లో పేలుడు జరిగింది. బెంగళూరు పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత శనివారం (మార్చి 2) అనుమానితుడు బ్యాగ్‌ని మోస్తున్న మొదటి చిత్రం బయటపడింది. ఓ వ్యక్తి చేతిలో క్యాప్, మాస్క్, ఐఈడీతో కూడిన బ్యాగ్‌తో కేఫ్‌లోకి ప్రవేశించడం.. ఆపై దానిని అక్కడే వదిలేయడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.
బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ కేఫ్‌లలో ఒకటి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పేలుడుకు ముందు బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అనుమానితుడితో కనిపించిన వ్యక్తిని కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యక్తి బెంగళూరు నివాసి. ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం అతడిని విచారించే పనిలో నిమగ్నమై ఉంది.
Read Also:Ganta Srinivasa Rao: చీపురుపల్లి నుంచి పోటీ చేయనని తప్పుకున్న గంటా శ్రీనివాసరావు
పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడు ముఖానికి మాస్క్‌తో కప్పుకున్నట్లు సీసీటీవీ వీడియోలో కనిపిస్తోంది. స్పెడ్స్, టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతను కేఫ్ లోపల ఇడ్లీని తీసుకువెళుతున్నట్లు కూడా చూడవచ్చు. రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.50 నుంచి ఒంటి గంట మధ్య పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా కేఫ్‌లో ఉన్న 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి.
అనుమానితుడు బస్సులో వచ్చాడు: కర్ణాటక హోంమంత్రి
కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వరం మాట్లాడుతూ, ‘మేం చాలా బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి కొన్ని ఆధారాలు సేకరించాం. పేలుడు జరిగిన సమయంలో బీఎంటీసీ బస్సు అటుగా వెళుతోంది. నిందితుడు బస్సులో వచ్చినట్లు సమాచారం అందింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటాం. మా టీమ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. పేలుడు కోసం టైమర్‌ను ఉపయోగించారు. ఫోరెన్సిక్ బృందం పని చేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కలుస్తున్నాం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో జరిగే ఈ సమావేశంలో పేలుడుపై చర్చించనున్నారు.
ఈ పేలుడు ఘటనపై బెంగళూరు పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో యూఏపీఏ, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
Read Also:Ram Charan – Upasana: రామ్ చరణ్ కు భార్య అంటే ఎంత ప్రేమో.. ఫ్యాన్స్ ఫిదా..