Jagtial Tragedy: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్ మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న సాయంత్రం వరకు పోలిస్ స్టేషన్ లోనే ఏ.ఎస్.ఐ. విధులు నిర్వహించారు. రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున మృతి చెందారు.
Read also: Jr Ntr : ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు.. న్యూ లుక్ ఫోటోలు వైరల్..
ఆదిలాబాద్ లో 4న జరిగే మోడీ సభకు నేడు బందోబస్తు కు వెళ్లేందుకు (నిన్న) ఏర్పాటు చేసుకొన్నారు. ఎటువంటి సమస్యలు లేవనెత్తకుండా అందరికి సూచించారు. అప్పటి వరకు ఆయన పోలీస్ స్టేషల్ లోనే అందరి కళ్లముందు ఉన్న ఏఎస్ఐ అక్కడి నుంచి ఇంటికి బయలు దేరాడు. అయితే ఇంటికి వెళ్లి రోజూ లాగానే భోజనం చేసి సేవించాడు. అయితే రాత్రి అస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తీసుకుని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందించిన ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆరోజు తెల్లవారు జామున ఆయన తుడి శ్వాస వదిలారు. దీంతో అప్పటి వరకు ఆరోగ్యంగా తమ కళ్లముందు వున్న రాజేందర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ వార్త పోలీస్ అధికారులకు తెలియగానే షాక్ కి గురయ్యారు. నిన్న స్టేషల్ అంత ఆక్టివ్ గా ఉన్న రాజేందర్ తెల్లవారే సరికి మృతి చెందిన ఘటన వినడం చాలా బాధగా ఉందని తెలిపారు. రాజేందర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజేందర్ ఇంటికి వెళ్లిన అధికారులు కుటుంబ సభ్యులను సీఐ.ఎస్ఐ, పోలిస్ సిబ్బంది పరామర్శించారు.
Afghanistan : ఆఫ్ఘనిస్థాన్ లో హిమపాతం.. 15మంది మృతి, 30మందికి గాయాలు