Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు.!
- బీఆర్ఎస్ దిమ్మెలను టీడీపీ నాయకులు కూలగొట్టాలని పిలుపునిచ్చారు
- ఇరుపార్టీల మధ్య గొడవలకు రేవంత్ వ్యాఖ్యలు దారితీస్తున్నాయి
- ముక్కలవుతారు అని మాట్లాడిన తలసానిపై కేసు పెట్టారు
- మరి కేసీఆర్‌ను బొంద పెట్టాలని మాట్లాడిన రేవంత్‌పై కూడా కేసు పెట్టాలి. -దాసోజు శ్రవణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను “100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలి” అని రేవంత్ రెడ్డి మాట్లాడటంపై శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దౌర్జన్యమని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Ratha Saptami Celebrations : రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
Also Read
నోటికి హద్దులు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీని కూల్చేస్తానని, బీఆర్ఎస్ దిమ్మెలను టీడీపి నాయకులు కూలగొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ఇరు పార్టీల మధ్య గొడవలకు దారితీస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ఇటువంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆరోపించారు.
సికింద్రాబాద్ అస్థిత్వంపై ప్రశ్నించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసులు పెట్టినప్పుడు, మరి కేసీఆర్‌ను బొందపెడతామన్న ముఖ్యమంత్రిపై ఎందుకు కేసులు పెట్టరని శ్రవణ్ ప్రశ్నించారు. తలసానిపై ప్రయోగించిన అదే సెక్షన్లను రేవంత్ రెడ్డిపై కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ.. “ఆయన శరీరం కాంగ్రెస్‌ది, కానీ ఆత్మ మాత్రం టీడీపీది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో టీడీపీ పతనానికి రేవంత్ రెడ్డే బీజం వేశారని, ఇప్పుడు బీజేపీ-టీడీపితో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. 1200 మంది అమరుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేడు తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తగదని హెచ్చరించారు.
యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!