చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం.. చిత్తోర్‌గఢ్ నగరానికి చెందిన సత్పాల్ సింగ్ అరోరా 81 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదవడానికి కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈయన చిత్తోర్‌గఢ్ నగరంలోని ప్రతాప్‌గఢ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన అడ్మిషన్ కోసం లా కాలేజీకి చేరుకోవడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా నేర్చుకోవాలనే తపించే ఆయనను కొనియాడారు.…
తనపై వచ్చిన ఆరోపణలపై రీకాల్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏవైనా ప్రశ్నలుంటే యూపీఎస్‌కు సమాధానం ఇస్తానని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతానని ఆమె వ్యాఖ్యానించారు.
ఎవరి వద్దైనా ఒసామా బిన్ లాడెన్ ఫొటో, ఐసిస్ జెండా కనిపించినంత మాత్రాన, ఆ ఒక్క ఆధారంగా మాత్రమే ఉపా చట్టం కింద అతనిపై చర్యలు తీసుకోలేమని, ఢిల్లీ హైకోర్టు ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తల్లి సంక్షరణ గురించి విస్మరించిన కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురు.. ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.
రాజస్థాన్‌లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు 'రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023'. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది.
Harassment : అబుదాబికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను స్క్రూడ్రైవర్‌తో కొట్టి, బాక్సింగ్‌తో ఆమె ముందు పళ్లను కోల్పోయేలా చేసినందుకు కోర్టు దోషిగా తేల్చింది.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియాలోని పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు కంపెనీలు కల్పించాయి. గతంతో పోలిస్తే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే నెదర్లాండ్స్‌లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం ఉద్యోగుల హక్కుగా మారనుంది. ఈ ప్రతిపాదనపై డచ్ పార్లమెంట్ దిగువ సభ గత…
చిన్నపిల్లలు అల్లరి చేయడం సహజం. అల్లరి చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. పిల్లల్ని చిన్నతనం నుంచే మంచి దారిలో పెట్టాలి. లేదంటే పెద్దయ్యాక దారితప్పుతారు. పిల్లలు తప్పులు చేసినా, మంచి విజయాలు సాధించినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రులకు దక్కుతుంది. ఇకపై ఆ దేశంలో పిల్లలు తప్పుచేస్తే దానిక బాధ్యతగా తల్లిదండ్రులకు శిక్ష విధిస్తారట. ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్నది మరెవరో కాదు. చైనా. గత కొంతకాలంగా చైనాలో పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి…
ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. పాశ్ఛాత్య దేశాల్లో విడిపోవడం, విడాకులు తీసుకోవడం కామన్ అయింది. కొన్ని దేశాల్లో విడాకులు తీసుకోవడం కొంత కష్టమైన అంశం కావొచ్చు. అయితే, ప్రపంచంలో విడాకుల చట్టం లేని దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో విడాకులు తీసుకోవడం అస్సలు కుదరని పని. ఎందుకంటే ఆ దేశ చట్టాల్లో విడాకుల చట్టం లేదు. ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండేందుకే ప్రయత్నిస్తారు తప్పించి విడిపోవాలని…