TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
- రాహుల్ అరెస్ట్‌ను ఖండించిన టీపీసీసీ
- రేపు భారీ నిరసన ర్యాలీ
- నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు మార్చ్
- కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ గౌడ్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చర్యలు నిరంకుశత్వానికి, నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఈ అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ రేపు ఉదయం ‘ఛలో రాజ్ భవన్’ (లోక్ భవన్) కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
NEET పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని, అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీ ఇంటి ముందు ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టారని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, విచారణకు భయపడి భాజపా సర్కార్ తోక ముడిచి అరెస్టులకు పాల్పడిందని విమర్శించారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఈ క్రమంలోనే భాజపా నిరంకుశ పాలనపై పెద్ద ఎత్తున సమరం చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ (లోక్ భవన్) వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి భాజపా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!