తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు/ పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, డీజీపీ… 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ర్యాలీ తర్వాత బహిరంగ సభను నిర్వహించాలి.. ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలు, 50 పెద్ద జెండాలు అందించాలని సూచించారు.. ఈ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకై సీనియర్ అధికారిని ప్రతీ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా నామినేట్ చేయాలని తెలిపారు.
Read Also: Botsa Satyanarayana: మాకు గ్యారెంటీ లేదు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ ఉంది
ఇక, 17వ తేదీన జాతీయ జెండాను అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు/ప్రజాప్రతినిధులచే జాతీయ జెండాను ఎగురవేయించాలని సూచించారు సీఎస్, డీజీపీ.. 17న హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో ముఖ్యమంత్రి జెండాను ఎగురవేయనున్నారని తెలిపారు.. ఇక, హైదరాబాద్‌లో కొమరం భీమ్ ఆదివాసీ భవనం మరియు సంత్ సేవాలాల్ బంజారా భవన్‌ను కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని.. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. గిరిజన సంఘాలకు చెందిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరిని మధ్యాహ్నం జరిగే సమావేశానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు, 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ మరియు వాణిజ్య సంస్థలను 15వ తేదీ నుండి విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఇతర అధికారులకు స్పష్టంచేశారు.