తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు/ పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, డీజీపీ… 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ర్యాలీ తర్వాత బహిరంగ సభను నిర్వహించాలి.. ప్రతి జిల్లాకు…
మేషం : ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. క్రయ, విక్రయాలు సామాన్యం. ఆప్తుల ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. వాహనం నిదానంగా నడపడం మంచిది. ఉద్యోగయత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. వృషభం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.…
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్ పై దృష్టి పెట్టగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాక ఖరారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన…
సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. గతంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వలస, గల్ఫ్’ లాంటి సందేశాత్మక సినిమాలును ఆయన రూపొందించారు. ఇప్పుడు సమకాలీన కథతో తెరకెక్కించిన ‘హనీ ట్రాప్’ మూవీని సెప్టెంబర్ 17 న విడుదల చేయటానికి సిద్ధమౌతున్నారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వి. వి. వామనరావు నిర్మిస్తున్నారు. ఈ…