Talasani Srinivas Yadav: కొందరు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.. మంచి చేస్తే విమర్శిస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఇవాళ జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా నాయకుడు కొండా లక్ష్మణ్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం తన పదవులను త్యాగం చేసారని మంత్రి అన్నారు. నిరంతరం పేద బడుగులు బలహీన వర్గాల కోసం అడ్వకేట్ గా ఎంతో కృషి చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు లేకుండా పోయిందని విమర్శించారు. స్వరాష్ట్రంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రస్తుతం లీడర్లు ఎక్కువ అయిపోయారు! అందరూ స్టేజ్ మీదనే ఉండాలనుకుంటే ఎలా.? అని ఎద్దేవ చేశారు. వచ్చే ఏడాది కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు దేశమంతా గర్వపడే విధంగా చేయాలని అన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కూడా ఒక్కటే ఉండాలని తెలిపారు. చేనేతల కోసం ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించుకుంటే.. మనం మన నేతన్నతో తయారు చేయించామని మంత్రి అన్నారు. 2014 ముందు నాయకులు లేరా.? ఎందుకు పద్మశాలీలను పట్టించుకోలేదు.? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతికి హైదరాబాద్ నడిబొడ్డున లక్షల మంది మధ్యన చేద్దామని అన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేయలేదని అన్నారు. కొందరు అయితే ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, వాళ్లకు ఎటువంటి అధికారం లేకున్నా కూడా.. మంచి చేస్తే విమర్శిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. మూడు తరాలకు ఆదర్శంగా నిలిచినా వ్యక్తి కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా దీక్ష చేసారని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రతి వ్యక్తిని స్మరించుకుంటున్నామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి అధికారికంగా జరుపుతునందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.
Kajal Aggarwal: రీఎంట్రీలో ఐటమ్‌కు రెడీ అంటున్న కాజల్..?