Kajal Agarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ కోసం రెడీ అవుతోంది. ఆరేళ్ల క్రితం పెళ్ళికి ‘పక్కా లోకల్..’ అంటూ చిందేసిన కాజల్ మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి సై అంటోందట. పెళ్ళి ఆ తర్వాత బాబు పుట్టటం వంటి కారణాలతో కొంత కాలం వెండితెరకు దూరంగా ఉన్న కాజల్ రీఎంట్రీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ చెమటలు చిందిస్తోంది. ఇక తన రీఎంట్రీలో మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముద్దుగుమ్మ.
Read Also: NBK107: కత్తితో ఫైటింగ్ చేస్తున్న బాలయ్య.. వీడియో వైరల్
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప2’ లో ఐటమ్ సాంగ్ చేయబోయేది కాజల్ అని వినిపిస్తోంది. ‘పుష్ప’లో సమంత చేసిన ‘ఊ అంటావా మామ’ పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసినందే. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ద్వారా సమంతకు ఎంత గుర్తింపు వచ్చిందో అంతకు మించి ఈ పాట ద్వారా సాటిలేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది. నిజానికి ఈ పాట కోసం సమంత ఫస్ట్ ఛాయిస్ కాదు. ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలను కూడా సంప్రదించారు. అయితే చివరకు ఆ అవకాశం సమంతకు దక్కింది. అది సమంతకు ఎంత పేరు తెచ్చిందో సినిమాకు కూడా అంతకు మించి ప్లస్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 కోసం మరో ఐటమ్ సాంగ్ రెడీ చేస్తున్నాడు సుకుమార్. ఈ పాటలోనే కాజల్ చిందేయబోతున్నట్లు తెలియవస్తోంది. అదే నిజం అయితే కాజల్ చేయబోయే రెండో ఐటమ్ అవుతుంది. మరి తొలి ఐటమ్ నంబర్ ‘పక్కా లోకల్…’ ని మించి ఈ ఐటమ్ ఉంటుందేమో చూడాలి.