సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు వస్తుందా లేదా అన్న మీమాంస ఉండేది.. నేటితో అది తొలగిపోయింది అన్నారు సీపీ సజ్జనార్. పొగొట్టుకున్న సొత్తును ఇప్పించాలని చాల రోజులుగా అనుకుంటున్నాను.. ఆ ఇనిషియేటివ్ ఈరోజు సాధ్యం అయింది. దీన్ని రెగ్యులర్ గా నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం. 176 కేసులో కోటిన్నర సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నాము అని తెలిపారు. కేసు కట్టడం ఒక ఎత్తు అయితే రికవరీ చేయడం ఇంకో ఎత్తు.. విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన వారందరికీ అభినందనలు. చోరీ కేసులో సొత్తును తిరిగి ఇప్పించడంలో కోర్టు ఆఫీసర్స్ పాత్ర కీలకమైంది. చోరీ కేసులో సొత్తును తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
పోలీస్ వ్యవస్థలో చోరీ అయిన ప్రాపర్టీ ఇపించడం ఒక భాగం. బాధితులకు ఇక నుండి శ్రమ లేకుండా చోరీ అయిన సొత్తును కోర్టు నుండి తిరిగి ఇప్పించే బాధ్యతను సైబరాబాద్ పోలీసులు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నేరం జరిగాక ఫిర్యాదు చేయాలి.. అలసత్వం వహించరాదు. ఫిర్యాదు చేస్తే నేరస్తుడిని పట్టుకునే అవకాశం ఉంటుంది.. లేదంటే ఆ నేరస్తుడు మరికొన్ని నేరాలు చేయగలుగుతాడు. ఇలాంటి ఇనిషియేటివ్ల వల్ల ప్రజలకు పోలీసులు పట్ల మరింత బాధ్యత పెరుగుతుంది. సైబరాబాద్ పోలీసులకు ఈరోజు సంతృప్తికర రోజు. వచ్చే రోజులో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ మేళా కంటిన్యూ అవుతుంది అని పేర్కొన్నారు.