సంక్రాంతి పండుగ అనగానే ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ వేడుకల్లో వినోదం కంటే విచారమే ఎక్కువగా మిగిలిస్తున్న ‘చైనీస్ మాంజా’ వినియోగంపై హైదరాబాద్ సిటీ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారై, గాజు పొడి పూత కలిగిన ఈ దారం పర్యావరణానికి , ప్రాణకోటికి పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం 2016లోనే చైనీస్ మాంజాపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. దీనికి తోడు నేషనల్…
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని…
CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. జంటనగరల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని డీసీపీ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి…
వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన మూడు వేర్వేరు ట్వీట్లు ఇప్పుడు మందుబాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ‘లాయర్’ను వెతకడం కంటే.. గూగుల్‌లో ‘క్యాబ్’ను వెతకడం మిన్న! అంటూ.. సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేయగా అది…
హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వార్షిక నివేదికను విడుదల చేశారు. హైదరాబాదులో నేరాల సంఖ్య 15% తగ్గినట్లు వెల్లడించారు. మహిళల పై నేరాలు, ఫోక్సో కేసుల సంఖ్య పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది 30,690 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా గతేడాది 35944 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది176 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.. 166 కిడ్నాప్ కేసులు 4536 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడది మహిళలపై జరిగిన నేరాలు ఆరు శాతం పెరిగాయి.…
హైదరాబాద్ పోలీసు కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. సీపీ పాల్గొని తనిఖీల విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు ఇవ్వడమే కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సజ్జనార్ వివరించారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్…
Phone Tapping : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ మొదటిసారిగా కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి…
బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను సిపి సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదని, ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమని ఆయన తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటివారినైనా జైలుకు పంపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును…
I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ మీద ఐ బొమ్మ రవి ఎలాంటి నోరు విప్పట్లేదని తెలుస్తోంది. మనకు తెలిసిందే కదా ఐ బొమ్మ రవిని పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు కస్టడీలో భాగంగా వెబ్ సైట్ సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆరా తీశారు. ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. పైరసీ నుంచి వచ్చిన డబ్బును ఎవరికి పంపించాడు, బెట్టింగ్ యాప్స్…
పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి కోర్టు ఐదు రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజుల విచారణ ముగియగా కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. నేడు మూడో విచారణ కూడా ముగిసింది. అయితే మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని స్వయంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీస్లో రవిని సజ్జనార్ విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. మూడో విచారణ అనంతరం…