హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ముఠా లోని ఐదుగురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండివ1500 నకిలీ 500 రూపాయలవి సీజ్ చేశాము. అలాగే రద్దయిన 500 రూపాయలు నోట్లు 9 లక్షలు సీజ్ చేశాము. ప్రధాన నిందితుడు సిద్దిపేట కి చెందిన సంతోష్ కుమార్ తో పాటు… బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సుంకర శ్రీనివాస్ ను అరెస్ట్ చేశాము అని తెలిపారు. ఈ ముద్రించిన నోట్లు లలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కమిషన్ తీసుకున్నాడు. మొత్తం 26 లక్షలు విలువైన నోట్ల ను ఈ ముఠా నుండి స్వాధీనం చేసుకున్నాం అని పేర్కొన్నారు.