మెట్రోపై కరోనా ప్రభావం… ఆక్యుపెన్సీలేక అవస్థలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి.
కాగా, ఇప్పుడు రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రోలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ఆలోచిస్తున్నారు. మెట్రో ఏసీ బోగీలు కావడంతో కరోనా వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కరోనా నిబంధనలు అమలు చేస్తూనే ప్రస్తుతానికి మెట్రో నడుపుతున్నారు. ఇక ఎంజీబిఎస్ నుంచి జేబీఎస్ వరకు నడిపే మెట్రో రైళ్లలో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ఈ మార్గంలో ప్రయాణికులు లేకుండానే మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. కరోనా కారణంగా కోట్లాది రూపాయల నష్టం వస్తున్నట్టు మెట్రో నిర్వాహకులు పేర్కొంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.