Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న 5వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. నాలుగో టీ20లో టీమిండియా ఓడిపోగా.. ఎలాగైనా ఈ ఆఖరి పోరులో గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ సిరీస్ లో వరుసగా నాలుగు సార్లు టాస్ గెలిచిన టీమిండియా.. ఐదోసారి టాస్ ఓడిపోయింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. వికెట్ బాగుందని, చివర్లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపారు. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఒక మార్పు చేశామని, మ్యాట్ ఫిషర్ స్థానంలో బ్లేర్ టిక్నర్ను జట్టులోకి తీసుకున్నామని చెప్పారు.
Also Read
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
- Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
- Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
మరోవైపు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తమకు కూడా ముందుగా బ్యాటింగ్ చేసి పిచ్ ఎలా ఉందో పరీక్షించుకోవాలని ఉందని చెప్పారు. ఆక్లాండ్ మ్యాచ్ ఓటమి తర్వాత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రణాళికలు మార్చుకున్నామని తెలిపారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్‌లు జట్టులోకి వచ్చారు.
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో ప్రతీ మ్యాచ్ కీలకమైనదేనని, నిరంతరం నేర్చుకుంటూ మెరుగవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జట్టులో సరైన నిర్ణయాలు తీసుకోవడమే తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
భారత జట్టు (Playing XI): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ జట్టు (Playing XI): టిమ్ సీఫెర్ట్ (కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, బ్లేర్ టిక్నర్.
- Tags
- cricket
- ind vs nz
- Shreyas Iyer
- T20I
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!