దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Covid-19 Cases: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ (మంగళవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటింది.
ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు వెలుగు చూస్తున్నాయి.. రాష్ట్రంలో తాజాగా, మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఏలూరుకు చెందిన భార్యాభర్తలకు కరోనా సోకినట్లుగా తేల్చారు వైద్యులు.. మరోవైపు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడ్డారు.
Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.
Covid-19: కొన్నాళ్లుగా సద్దుమణిగి ఉన్న కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌లో వేల సంఖ్యలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసియా అంతటా కొత్త కోవిడ్-19 వేవ్ వ్యాపిస్తోంది. కే
దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతుంది. మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 87 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కాగా.. ముంబైలో 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పూణె, సాంగ్లీ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో 37 మందికి కరోనా సోకింది. మార్చి 2020 నుండి…
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య దాదాపు 8 లక్షల 44 వేల 558కి చేరింది.
Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. వాతావరణ పరిస్థితులు, చలి పెరడగం కూడా వ్యాధి పెరిగేందుకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.