AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. 8 చోట్ల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
01 Nov 2026 07:57 AM (IST)
ఓటు హక్కు వినియోగించుకున్న ఏబీ వేంకటేశ్వర రావు!
విజయవాడలో తన ఓటు హక్కును ఏబీ వెంకటేశ్వరరావు వినియోగించుకున్నారు. 'ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మంచి పరిణామం. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిన్న కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా మావాళ్లు వీడియోలు రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను' అని ఎన్టీవీతో ఏబీవీ ప్రతేకంగా చెప్పారు.
-
01 Nov 2026 07:51 AM (IST)
పులివెందుల 27వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత!
పులివెందుల 27వ వార్డు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వృద్ధురాలి చేతిలోని బ్యాలెట్ స్లిప్‌ను టీడీపీ ఏజెంట్లు లాక్కున్నారు. పులివెందుల సత్రం స్కూల్ పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
-
01 Nov 2026 07:35 AM (IST)
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్ అయ్యారు. కొందరు వైసీపీ నేతలను బైండోవర్ చేసి.. పోలీస్ స్టేషన్లకు తరలించారు.
-
01 Nov 2026 07:25 AM (IST)
బెజవాడ కార్పొరేషన్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు!
బెజవాడ కార్పొరేషన్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు అయ్యాయి. 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారయ్యాయి.
-
01 Nov 2026 07:19 AM (IST)
ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్!
మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!