Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, నగరంలో ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లే ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి. కాగా,…