Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. నిత్యం నిర్వహించే ట్రాఫిక్ నియంత్రణ, నిఘా చర్యలతో పాటు వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడే వారిపై ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ఏప్రిల్ 26, 2026 నుండి ఇప్పటివరకు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో భారీ సంఖ్యలో ఉల్లంఘనలు నమోదయ్యాయి.
ఏకాగ్రత లోపించడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం మరియు వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 3,619 మంది డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడుతూ పట్టుబడ్డారు.
Also Read
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
- Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
ఉల్లంఘనుల వివరాలు:
ద్విచక్ర వాహనదారులు: 3,469 మంది
ఆటో/మూడు చక్రాల వాహన డ్రైవర్లు: 46 మంది
కార్లు/నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు: 104 మంది
వాహనం నడుపుతూ మొబైల్ వాడటం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇది డ్రైవర్ మానసిక, దృష్టి మరియు చేతుల నియంత్రణను దెబ్బతీస్తుందని, తద్వారా ప్రతిస్పందించే సమయం తగ్గి తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే ఈ పొరపాటు వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా తోటి ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, చట్టప్రకారం కఠిన జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడకంపై రాజీలేని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లను నిరంతరం కొనసాగిస్తామని ట్రాఫిక్ విభాగం తెలిపింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి పోలీసులకు సహకరించాలని, డ్రైవింగ్ సమయంలో ఫోన్లకు దూరంగా ఉంటూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని కోరారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!