Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
- పీపీపీ విధానంలో ఎంఆర్ఐ సేవలు.. రోగులకు ఉచితం
- మహబూబ్‌నగర్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
- రెండేళ్లలో అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు విస్తరణ
- యంత్రాల నిర్వహణ ఖర్చు తగ్గించడంపై సర్కారు దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ (MRI) సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడ్‌లో ఈ సేవలను రోగులకు అందుబాటులోకి తేనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. పీపీపీ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే పేషెంట్లకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. సుక్రవారం కోటిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్ట్.. రెండేళ్లలో స్టేట్ వైడ్ రోలౌట్
ఈ నూతన విధానాన్ని మొదటగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. అక్కడ వచ్చే ఫలితాలు, అనుభవాలను ఆధారంగా చేసుకుని రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జీజీహెచ్‌లలో పీపీపీ మోడ్‌లో ఎంఆర్ఐ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు నిర్వహించినా, సేవల నాణ్యత, రిపోర్టుల వేగం , మెషిన్ల మెయింటెనెన్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
Also Read
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
తమిళనాడు మోడల్‌పై స్టడీ.. ప్రభుత్వానికి 20 శాతం మేర తగ్గనున్న ఖర్చు
ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, టిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌తో పాటు వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, భూపాలపల్లి జీజీహెచ్‌లలో మాత్రమే ఎంఆర్ఐ సదుపాయం ఉంది. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ వంటి ఉమ్మడి జిల్లాల్లో ఈ సేవలు లేకపోవడం, ఉన్న చోట కూడా సాంకేతిక సమస్యల వల్ల తరచూ అంతరాయం కలగడంతో రోగులు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో అమలువుతున్న పీపీపీ విధానాలపై అధికారులు, డాక్టర్ల బృందం అధ్యయనం చేసింది. ఈ విధానం వల్ల యంత్రాల కొనుగోలు, నిర్వహణ భారం ప్రభుత్వానికి దాదాపు 20 శాతం తగ్గుతుందని, బ్రేక్‌డౌన్ లేకుండా నిరంతరం ఎంఆర్ఐ సేవలు అందుతాయని అధికారులు మంత్రికి వివరించారు.
పేదలకు అత్యాధునిక వైద్యమే లక్ష్యం
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేషెంట్ కూడా వైద్య పరీక్షలకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు సూచించిన ప్రతి పేషెంట్‌కు ఉచితంగా ఎంఆర్ఐ పరీక్షలు జరిగేలా ఒప్పంద నిబంధనలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, TGMSIDC ఎండీ గౌరవ్ ఉప్పల్, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, డీఎంఈ డాక్టర్ వాణి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!