తెలంగాణలో బీజేపీకి ఉన్నది 5 శాతం ఓటింగ్ మాత్రమే… రాష్ట్రంలో టీఆర్ఎస్‌కి అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.. మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మీద ఆయన చేసిన కామెంట్స్ క్షమించలేనివి.. కానీ, మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చే పరిధి ఏఐసీసీది అన్నారు.. బయటకు వెళ్లివాళ్లను సస్పెండ్ చేయడం కంటే.. వాళ్లను కన్విన్స్ చేసుకోవాలని సూచించారు..క్రమశిక్షణ కమిటీ ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తోంది.. కొందరిని బహిష్కరించి.. కొందరిని పట్టించుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు..
ఇక, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చాలా విషయాలు మాట్లాడారు.. అన్నింటిపై పార్టీ సమీక్ష సమావేశంలో చర్చ చేస్తామన్నారు మహేశ్వర్‌రెడ్డి.. అనేక అంశాలు చర్చ చేయాల్సి ఉంది.. జగ్గారెడ్డి లాగా మేం బయట మాట్లాడలేమన్న ఆయన.. కోమటిరెడ్డి షోకాజ్ నోటీసులకి రిప్లై ఇచ్చారు.. ఎంపీ కదా అని ఆలోచిస్తున్నట్టు ఉందన్నారు.. ఆ విషయం పెండింగ్‌లో ఉందని.. శశిధర్ రెడ్డికి కూడా నోటీసు ఇస్తే బాగుంటుందన్నారు.. జగ్గారెడ్డి మాట్లాడేది తప్పో.. ఒప్పో అనేది చెప్పలేన్నారు.. మరోవైపు.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.. ఏదేమైనా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం మాత్రం కాంగ్రెస్ పార్టీయే అన్నారు మహేశ్వర్‌రెడ్డి..