New Traffic Rules: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ జాయింట్ సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి.. ఇక, ఏద పొరపాటు చేసినా.. జేబుకు చిల్లు పడడం ఖాయం.. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు… రాంగ్ సైడ్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం.. ఇలా ఏది చేసినా జరిమానా తప్పదు.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 1700 రుపాయాలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 రుపాయలు.. ఇలా ఫైన్ వేయబోతున్నారు.. ఈ నెల 28 నుంచి రాంగ్‌సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో, కొత్త రూల్స్ పై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు..
Read Also: Dasyam Vinay Bhaskar: దేశ ప్రజలందరిచూపు కేసీఆర్ వైపు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం..!
Also Read
రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తీరుపై వివరణ ఇస్తున్నాం.. ఇవి కొత్తగా వచ్చిన రూల్స్ కావు అన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. గతంలో ఛలాన్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి డిస్కౌంట్లు ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. టూ వీలర్ వాహనదారులకు గతంలో కంటే ఇప్పుడు ఛలాన్లను తగ్గించామన్నారు.. కానీ, కార్లు, హెవీ వెహికిల్స్ కు ఛలానాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్లు, హెవీ వెహికల్స్‌తో ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఆయన.. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.. అందుకే సీరియస్ గా తీసుకున్నామని స్పష్టం చేశారు.. వాహనదారుల్లో డిసిప్లేన్ రావడానికి మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని తెలిపారు.
ఛలాన్లతో ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు జాయింట్ సీపీ రంగనాథ్.. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగేవారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన ఆయన.. టెంపర్వరీ నెంబర్ కేవలం నెలరోజుల వరకే ఉంటుందని.. ఆ తర్వాత ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సిందే.. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు నేరాలకు పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక, హైదరాబాద్ మహా నగరంలో 2014లో 41 లక్షల వాహనాలు ఉంటే.. ఇప్పుడు 81 లక్షల వరకు వాహనాలు పెరిగాయని వివరించారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. కాగా, ట్రాఫిక్ నిబంధనల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారు హైదరాబాద్ పోలీసులు.. ఇప్పటికే సిగ్నల్స్ దగ్గర.. బోర్డర్ దాటకుండా చర్యలు చేపట్టిన పోలీసులు.. అందులా చాలా వరకు విజయం సాధించారు.. వాహనదారుల్లో అవగాహన పెంచుతున్నారు.. ఇక, ఇప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిఫుల్ రైడింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.. దీని కోసం ఈ నెల 28వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!