Mother Heroine: మహిళలకు బంపరాఫర్.. 10 మంది పిల్లలను కంటే రూ.13 లక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని దేశాలు జనాభా పెరిగిపోతుందని ఆందోళన చెందుతుంటే.. మరికొన్ని దేశాలు జనాభా తగ్గిపోతుందని అప్రమత్తం అవుతున్నాయి.. జనాభా తగ్గిపోతుండటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు.. కొత్త స్కీమ్ ప్రకారం పది మంది పిల్లల్ని కనడం, వారిని బతికించగలిగితే.. ఆ తల్లులకు ఒకేసారి 13,500 పౌండ్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం రూ.13 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు.. “వీర మాతృమూర్తి” -“ఆదర్శ మాత” పథకాన్ని ప్రవేశపెట్టారు పుతిన్… రష్యాలో జనాభా పెరుగుదలే లక్ష్యంగా పలు ప్రోత్సాహాకాలు ప్రకటించారు.. అనేక ఇతర ప్రోత్సాహాకాలలో ఆర్ధిక ప్రోత్సాహకం ఒకటిగా ఉంది..
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
రష్ లో తరిగిపోతున్న జనాభా పెరిగేలా పలు చర్యలు, ప్రోత్సాహాకాలను ప్రకటించారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్‌తో యుధ్ధం, కోవిడ్ మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలే రష్ లో జనాభా తరుగుదుల సంక్షోభానికి ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.. గత్యంతరం లేకనే ఈ వినూత్న పథకానికి పుతిన్ శ్రీకారం చుట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. పెద్ద కుటుంబాలున్నవారు పెద్ద దేశ భక్తులని ఉద్భోదిస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్… ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో సుమారు 15 వేల మంది సైనికులు మరణించినట్లు అంచనా వేస్తున్నారు.. మరోవైపు, ఈ ఏడాది మార్చి నుంచి రష్యాలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి.. పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లతో రష్యాలోని ఆస్పత్రులు నిండిపోతున్నాయి.. గత రెండేళ్లలో రష్యాలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయని చెబుతున్నారు.
మొత్తంగా రష్‌యాలో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.. 10 మంది పిల్లలను కనడంతో పాటు, వారిని బతికించగలిగితే, తల్లులకు ఒకేసారి 13,500 పౌండ్లు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు.. అయితే, 10 మంది లేదా అంతకు మించి పిల్లలను కని, పెంచాలని ఎవరనుకుంటారు…!? అనేక ఇతరత్రా ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యలు కూడా ఇమిడి ఉన్నాయి కదా? అని ప్రశ్నిస్తున్నారు సామాజిక విశ్లేషకులు.. వాస్తవానికి రష్యా ఎదుర్కుంటున్న జనాభా సమస్యను అధిగమించేందుకు 1990 నుంచి అప్పుడప్పుడు జనాభా పెరిగేలా పలు దఫాలు ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు.. ఇక, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనేలా రష్యా మహిళలను ప్రోత్సాహిస్తూ పుతిన్ చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!