చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.. సీఎం కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయిన మధు యాష్కీ.. రాజకీయ లబ్ధికోసమే దళిత బంధు పథకం తెలస్తున్నారని.. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనన్నారు.
మరి, దళితలకు 3 ఎకరాల భూమి ఏమైంది ? అని ప్రశ్నించారు మధు యాష్కీ.. కేవలం దళిత బంధే కాదు… బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలని డిమాండ్ చేసిన యాష్కీ.. మరోవైపు.. బిజెపి మతతత్వ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో చేతి దెబ్బకు కారు, పువ్వు పల్టీకొట్టాల్సిందే అన్నారు.. యూత్ కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థల్లో, అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీట్లు వచ్చేలా చూస్తామని వెల్లడించిన యాష్కీ.. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి.. దానికోసం అందరూ కస్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.