Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- హైవేపై వంట చేస్తూ వీడియోలు
- ట్రక్ డ్రైవర్ జీవితాన్ని మార్చేసిన కొడుకు ఐడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jamtara Truck Driver Rajesh Rawani Success Story: సాధారణంగా ట్రక్ డ్రైవర్‌గా జీవనం సాగించే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారితే ఎలా ఉంటుంది? జార్ఖండ్‌లోని జామ్తాడాకు చెందిన రాజేష్ రావణి కథ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సుమారు 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ట్రక్ నడుపుతున్న ఆయన.. ఇప్పుడు ‘R Rajesh Vlogs’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ట్రక్ డ్రైవింగ్‌తో పాటు హైవేపై వంట చేయడం, తన రోజువారీ జీవితాన్ని వీడియోల రూపంలో చూపించడం ద్వారా రాజేష్ డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆదాయం కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
కొడుకు సలహాతో మొదలైన కొత్త ప్రయాణం
రాజేష్ రావణి చాలా కాలంగా సుదీర్ఘ ట్రక్ ప్రయాణాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రయాణాల సమయంలో రోడ్డు పక్కన స్వయంగా వంట చేసుకునేవారు. చికెన్, మటన్, చేపలు, పనీర్ వంటి వంటకాలను తయారు చేసి వాటి ఫొటోలు, చిన్న వీడియోలను కుటుంబ సభ్యులతో షేర్ చేసేవారు. 2021లో ఆయన కుమారుడు సాగర్ రావణి ఈ వీడియోల్లో కొత్త అవకాశాన్ని గుర్తించారు. తండ్రి చేస్తున్న వంటలను వీడియోలుగా ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఇవి రాజేష్ రోజువారీ జీవితం, ట్రక్ ప్రయాణాలు, వంటలకు సంబంధించిన సాధారణ వీడియోలుగానే ఉండేవి. అయితే క్రమంగా వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ప్రారంభమైంది.
Also Read
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
వంటల కంటే రాజేష్ జీవితంపై ఆసక్తి
రాజేష్ వీడియోలను చూసిన ప్రేక్షకులు కేవలం హైవేపై ఆయన చేసే వంటలను మాత్రమే కాకుండా.. అసలు ఈ వంటలు చేస్తున్న ట్రక్ డ్రైవర్ ఎవరు? ఆయన జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాలపై కూడా ఆసక్తి చూపడం ప్రారంభించారు. ఆయన ఫేస్ రివీల్ వీడియోకు భారీగా స్పందన వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ వీడియో విడుదలైన 24 గంటల్లో సుమారు 4.5 లక్షల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. దీంతో రాజేష్ రావణి కంటెంట్‌కు మరింత గుర్తింపు వచ్చింది. ట్రక్ డ్రైవర్‌గా తన రోజువారీ జీవితాన్ని చూపిస్తూ చేసే వీడియోలు క్రమంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నెలకు రూ.25-30 వేల నుంచి లక్షల్లోకి ఆదాయం
యూట్యూబ్ ఛానల్ ప్రారంభించకముందు రాజేష్ ప్రధాన ఆదాయం ట్రక్ డ్రైవింగ్‌పైనే ఆధారపడి ఉండేది. తనకు అప్పట్లో నెలకు సుమారు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఆదాయం వచ్చేదని ఆయన చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే యూట్యూబ్ ఛానల్ పాపులర్ అయిన తర్వాత ఆయన ఆదాయంలో గణనీయమైన మార్పు వచ్చినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం, ప్రస్తుతం రాజేష్ రావణి నెలవారీ ఆదాయం సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. కొన్ని నెలల్లో ఈ ఆదాయం రూ.18 లక్షల వరకు చేరిన సందర్భాలు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
‘లగ్జరీ ట్రక్’లో ప్రత్యేకత ఏమిటి?
రాజేష్ రావణి తన ట్రక్‌ను కూడా తన జీవనశైలి, సుదీర్ఘ ప్రయాణాలు, కంటెంట్ క్రియేషన్‌కు అనుగుణంగా కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రక్ ఆయనకు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా.. పని, విశ్రాంతి, కంటెంట్ తయారీకి ఉపయోగపడే మొబైల్ స్పేస్‌గా మారింది.
అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్
ట్రక్‌లో సౌకర్యవంతమైన సీట్లు, ఎక్కువసేపు ప్రయాణించేందుకు అనువుగా విస్తరించిన లివింగ్ స్పేస్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మొబైల్ కిచెన్
రాజేష్ కంటెంట్‌లో వంటకు ప్రత్యేక స్థానం ఉండటంతో.. ట్రక్‌లో ప్రత్యేకమైన కుకింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణంలో ఉన్నప్పటికీ తనకు నచ్చిన వంటకాలను తయారు చేసుకునే అవకాశం ఉంది.
ఆధునిక సౌకర్యాలు
ట్రక్‌లో AC, ఫ్రిజ్, స్టోరేజ్ క్యాబినెట్లు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. సుదీర్ఘ ప్రయాణాల్లో అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.
సాధారణ వృత్తి నుంచి డిజిటల్ కెరీర్ వరకు
రాజేష్ రావణి కథలో ప్రధానంగా కనిపించేది.. మన రోజువారీ జీవితంలో ఉన్న నైపుణ్యాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో సరైన విధంగా ప్రజలకు పరిచయం చేస్తే కొత్త అవకాశాలు ఏర్పడవచ్చనే అంశం. ట్రక్ డ్రైవర్‌గా తన వృత్తిని కొనసాగిస్తూనే.. వంట, ప్రయాణాలు, తన అనుభవాలను వీడియోలుగా మార్చడం ద్వారా రాజేష్ కొత్త ఆదాయ మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు సాగర్ రావణి వీడియో ఎడిటింగ్, యూట్యూబ్‌లో కంటెంట్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
Rajesh Rawani was just another truck driver from Jamtara, Jharkhand.
He drove thousands of kilometres across India for 25 years to earning around ₹25k–₹30k a month.
Money was tight.
Family responsibilities were heavy.
And there was nothing extraordinary about his life.… pic.twitter.com/NVVDtkI0g9— Radio India 🇮🇳 (@Radio_India_) September 18, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!