Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అగార్కర్ ఇకపై చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని, ఈ విషయాన్ని బోర్డులోని సీనియర్ అధికారులకు ఇప్పటికే తెలియజేసినట్లు పీటీఐకి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. అయితే, శుక్రవారం జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సెలక్షన్ కమిటీలకు సంబంధించిన భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని బోర్డు అధికారులకు అప్పగించినట్లు సమాచారం. దీంతో అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసే ప్రక్రియపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది..
అదే సమయంలో జూనియర్ సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలను భర్తీ చేయడంపైనా ఏజీఎంలో చర్చ జరిగింది. ఈ పదవుల కోసం బీసీసీఐకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ఎంపిక ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్ కొనసాగింపుపైనా సమీక్ష ఉంటుందని సైకియా వెల్లడించారు. ఆయన నియామకం స్వల్పకాలికమేనని, అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిపారు.
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
మరోవైపు, రాంచీ నుంచి భారత్-ఆస్ట్రేలియా టెస్టును తరలించే అంశంపై ఏజీఎంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జార్ఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి, మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ స్పష్టం చేశారు. అలాగే వాంఖడే స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలన్న అంశాన్ని ముంబై క్రికెట్ సంఘం ప్రతిపాదించింది. ఏజీఎంలో అంపైర్లు, మ్యాచ్ రిఫరీల చెల్లింపుల విధానాన్ని సవరించేందుకు కూడా ఆమోదం లభించింది. కొత్త గ్రేడింగ్ విధానం ప్రకారం A, B, C, D గ్రేడ్లకు రోజుకు వరుసగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల చొప్పున చెల్లింపులు చేయనున్నారు. ఇక, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వయస్సు మోసానికి సంబంధించిన కేసుల నేపథ్యంలో బీసీసీఐ వయస్సు ధ్రువీకరణ విధానాన్ని నవీకరించి ఆమోదించింది. లైంగిక వేధింపుల నివారణ విధానం కింద కొత్త అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. క్రికెట్ అండమాన్ అండ్ నికోబార్‌కు అసోసియేట్ సభ్యత్వం అంశం చట్టపరమైన సమస్య కారణంగా వాయిదా పడింది.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!