iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 India Sales: యాపిల్ కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. ఆ క్రేజే వేరు! తాజాగా భారత్‌లో ఐఫోన్ 18 సిరీస్ సేల్స్ ప్రారంభమవ్వడంతో ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కొత్త ఫోన్‌ను ఎలాగైనా సరే అందరికంటే ముందే సొంతం చేసుకోవాలని అభిమానులు వేకువజాము నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు. స్టోర్ తలుపులు తెరుచుకోగానే యాపిల్ సిబ్బంది చప్పట్లు, కేరింతలతో కస్టమర్లకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో ఎటు చూసినా ఇదే ఉత్సాహం కనిపించింది. సూరత్ నుంచి ముంబైలోని BKC స్టోర్‌కు వచ్చిన ఒక అభిమాని ఏకంగా 10 నుంచి 12 గంటలు కాచి కూర్చుని, దేశంలోనే మొదటి ఫోన్‌ను చేతిలోకి తీసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సంబరాలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. భారీ ధరలపై మీమ్స్, ట్రోల్స్ వచ్చినా.. యాపిల్‌కు ఉన్న క్రేజ్ ముందు అవేవీ నిలవలేకపోయాయి.
గతేడాది వచ్చిన ఐఫోన్ 17 Pro మోడళ్లతో పోలిస్తే, ఈసారి ఐఫోన్ 18 Pro, Pro Max విక్రయాలు తొలి రోజే 20 నుంచి 30 శాతం పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కస్టమర్లు కూడా ఈ సరికొత్త ఫీచర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శక్తివంతమైన A20 చిప్, సరికొత్త AI సాంకేతికత, అద్భుతమైన కెమెరాలు, మెరుగైన బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి కొత్తగా పరిచయం చేసిన ‘బర్గుండి’ కలర్ వేరియంట్‌కు కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. దీంతో పాటు బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ రంగుల్లో, 256GB నుంచి 2TB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో ఇవి లభిస్తున్నాయి. భారత్‌లో ఐఫోన్ 18 Pro ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, 18 Pro Max ధర రూ. 1,79,900గా ఉంది. సెప్టెంబర్ 12న సాయంత్రం ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కాగా, నమోదు చేసుకున్న వారందరూ తమ స్లాట్ సమయానికి వచ్చి ఫోన్లను ఉత్సాహంగా తీసుకెళ్లారు. పండుగ సీజన్ ముందర ఈ లాంచ్ రావడం కంపెనీకి మరింత కలసిరానుంది.
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఇదిలా ఉంటే, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. ఐఫోన్ 18 Pro సిరీస్‌కు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 28 శాతం వరకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. అధిక స్టోరేజ్ ఉన్న మోడళ్లను కొనడానికి జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, యాపిల్ సంస్థ ఈసారి ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలోకి కూడా అడుగుపెడుతూ ‘ఐఫోన్ డ్యూయో’ (iPhone Duo) అనే మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 23 నుంచి భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 2,99,900 (256GB) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ (2TB) రూ. 4,49,900 వరకు ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో యాపిల్ తన హవాను స్పష్టంగా కొనసాగిస్తోంది. FY26 లో భారత్‌లో 1.4 కోట్ల ఐఫోన్లను షిప్మెంట్ చేయడంతో కంపెనీ ఆదాయం ఏకంగా 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1 లక్ష కోట్లు) దాటి రికార్డు సృష్టించింది. ఇందులో సింహభాగం ఐఫోన్ల విక్రయాలదే కావడం విశేషం.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!