Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad Road Accident: శంషాబాద్ మండలంలోని పాలమాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి సమీపంలోని కల్వర్టును బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాద ధాటికి ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జు కాగా, అందులోని నలుగురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డ తండా (చౌడూర్ గ్రామం) నివాసులుగా అధికారులు గుర్తించారు.
మృతులు ఎస్టీ (లంబడ) సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త కేతవత్ లింబ్య (54, తండ్రి: తవోరియా), ఆయన భార్య కేతవత్ జమున (45, గృహిణి), వారి బంధువులైన వ్యాపారవేత్తలు కత్రావత్ మాన్సింగ్ (48, తండ్రి: దాద్రా), కేతవత్ వాస్రం (45, తండ్రి: లింబ్య)గా పోలీసులు గుర్తించారు. వీరంతా TS 07GZ 9333 నెంబరు గల వాహనంలో స్వగ్రామం నుంచి శంషాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అశోక్ తీవ్రంగా గాయపడటంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి పంపించారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో మెట్టుగడ్డ తండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!