Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- కాజీపేటలో పోలీసుల వాహన తనిఖీలు
- కారులో బయటపడ్డ భారీగా రద్దు చేసిన నోట్లు
- ముఠా నుంచి 10 ఫోన్లు, కారు స్వాధీనం
- మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తా సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో డీమోనిటైజ్డ్ (రద్దు చేసిన) పాత కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లతో అమాయక ప్రజలను మోసం చేసి, చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
మోసపూరిత నెట్వర్క్ గుట్టురట్టు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట చౌరస్తా వద్ద సీఐ జక్కుల శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపి సోదా చేయగా రద్దు చేసిన పాత నాణాలు, నోట్లు బయటపడ్డాయి. నిందితులు పాత కరెన్సీ నోట్లను చూపించి ప్రజల వద్ద నుంచి అసలైన చెల్లుబాటు అయ్యే నగదును కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
రూ.1.38 కోట్ల పాత నోట్లు స్వాధీనం
నిందితుల నుంచి రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత కరెన్సీ నోట్లతో పాటు, ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న రూ.6 వేల నగదు, 10 సెల్ఫోన్లు , నేరానికి ఉపయోగించిన ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ముఠా సభ్యులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!