Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏ సినిమా నిలుస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2027) కోసం భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను ఎంపిక చేసింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.
ఈసారి ఆస్కార్ ఎంట్రీ కోసం తెలుగు నుంచి నాలుగు సినిమాలు జ్యూరీ పరిశీలనకు వెళ్లాయి. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’, మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’ సహా ‘ఇగ్వా’ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆస్కార్ 2027 కోసం జ్యూరీ పరిశీలించిన 33 చిత్రాల్లో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం టాలీవుడ్‌కు ప్రత్యేకమైన విషయం. అయితే మంచి కథా నేపథ్యంతో వచ్చిన పెద్ది, ఇరుముడిలో ఒక్కటైనా ఎంపికవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చివరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ కూడా నెగ్గుకురాలేకపోయాడు. చివరికి ‘హనుమాన్ అంశ్’ కూడా చేతులెత్తేసింది.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ సినిమా మహారాష్ట్ర సంప్రదాయ జానపద ఆచారం, కళారూపమైన గోంధల్ నేపథ్యంలో తెరకెక్కింది. రాత్రంతా జరిగే ఈ సంప్రదాయ వేడుకను కథలో కీలక భాగంగా మలిచారు. కొత్తగా పెళ్లైన జంట చుట్టూ కథ ప్రారంభమై.. ప్రేమ, కోరికలు, మోసం, కుటుంబ కలహాలు, ప్రమాదకర పరిణామాల వైపు సాగుతుంది. ఈ చిత్రంలో ఇషితా దేశ్‌ముఖ్, కిశోర్ కదమ్, యోగేశ్ సోహోని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సంతోష్ దావఖర్‌కు ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోంధల్ చిత్రానికి గాను 2025లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయన సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు. 99వ అకాడమీ అవార్డుల వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. భారత్ అధికారిక ఎంట్రీగా గోంధల్ ఇప్పుడు అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తదుపరి ఆస్కార్ ఎంపిక ప్రక్రియలోకి వెళ్లనుంది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!