CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పోటెత్తాయి. దీంతో జంట జలాశయాలకు భారీగా వరద పెరగడంతో ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో మూసీ నదికి వరదనీటి ప్రవాహం పెరగటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు నుంచి రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
Read Also: Tumbad-2 : ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధం.. మరోసారి హారర్ ఫాంటసీ మాజిక్!
ఇక, ఎంజీబీఎస్‌కి వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని, బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత రెండు రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురవడంతో వరదల పట్ల పోలీసులు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ నది ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టి, వాహనాలు, ప్రజలు ఆ ప్రాంతాల ద్వారా వెళ్ళకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.