2018 లో విడుదలైన ‘తుంబాడ్’ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాల కలయికతో రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా గెలుచుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఆదే విజయం కొనసాగిస్తూ.. ఈ మూవీ ఇప్పుడు ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధమవుతోంది..
Also Read : Vetrimaaran-Simbu : శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..!
ఈ సీక్వెల్‌కు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ భాగస్వామ్యం కానుండగా. హీరో సోహుమ్‌షా ఈ చిత్రంలో మళ్లీ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ.. ‘తుంబాడ్ యూనివర్స్‌ను మరింత ఉన్నత ప్రమాణాలతో, ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా రాబోతుంది. కొత్త పథకాలు, దారుణమైన మాయాజాలం, అద్భుతమైన విజువల్స్ తో ఈ సీక్వెల్‌ను దర్శకుడు ఆదేష్ ప్రసాద్ అందించబోతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మేము పూర్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తుంబాడ్ యూనివర్స్‌ను కొనసాగిస్తాం. ఫ్యాన్స్ కోసం మరింత హారర్ ఫాంటసీ మాజిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. మొత్తానికి, హారర్ ఫాంటసీ ‘తుంబాడ్-2’ కోసం ఎదురుచూస్తున్నా అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.