నాగార్జునసాగర్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ పూర్తి కాన్సంట్రేషన్ తో ప్రచార సరళిని నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో ఎన్నికలు సమీపించిన తర్వాత రెండో బహిరంగ సభ రేపు సాయంత్రం హాలియా సమీపంలో నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గం అన్ని వైపులా కవర్ చేసే విధంగా ఈ సభ జరగనుంది. ఒకవైపు సభ జరగకుండా కాంగ్రెస్ బిజెపి అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ అవి ఫలించలేదు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి లక్షలాది మందితో సభ నిర్వహించడం ప్రమాదకరమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. అదే విధంగా శివకుమార్ అనే వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించడంతో ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా యజమానులతో కూడా హైకోర్టులో పిటిషన్ వేయించేందుకు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కూడా ఈ రోజు కోర్టు కొట్టివేసింది. దీంతో అవాంతరాలు అన్ని తొలగిపోయాయి.
కాగా ఎన్నికల సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు గ్రామం గ్రామం నుంచి కార్యకర్తలు అభిమానులు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా ఈ ప్రచారం ఈ బహిరంగ సభనో ఉపయోగించుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నించు ప్రయత్నించింది. ఇకపోతే 50 ఎకరాల్లో కేసీఆర్ ఎన్నికల సభ జరగనుంది. దీనికోసం 7 మండలాలు 2 మున్సిపాలిటీ నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు.
ఎన్నికల్లో చివరి ఘట్టం కావడంతో ఈ సభ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన నేతలు అందరూ గ్రామ గ్రామాన ప్రజలు కదిలించేందుకు చర్యలు తీసుకున్నారు. రేపు ఎన్నికల సభ ఉండగా ఎల్లుండి నుంచి ప్రచారం ముగియనుంది..ప్రచారం ముగియడానికి ముందు కేసీఆర్ సభ ఉండడం అనేది పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.