ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది: కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను సీఎంకు వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎంకు నివేదిక ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
Read Also: రాష్ట్రంలో దశ దిశలేని పాలన : సోము వీర్రాజు
ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం ఆదేశించారు.
Read Also:లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు అమిత్‌షాకు బండి సంజయ్ లేఖ
అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం ప్రత్యేకించి కేటాయించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని సీఎం అధకారులకు సూచించారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!