‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Varanasi’ Surprise: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ – వరల్డ్ గ్రాండ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్, ప్రమోషనల్ ప్రచారంలో జోరు పెంచిన మేకర్స్.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రోజున అభిమానుల కోసం అఫీషియల్ మర్చండైజ్ (Official Merchandise) ప్రకటనతో సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్ర యూనిట్ పంచుకున్న వివరాల ప్రకారం.. ‘వారణాసి’ థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన V-Neck టీ-షర్టులు (BOB), ‘రామ పిరమిడ్’ (Rama Piramid) కాన్సెప్ట్ ఉత్పత్తులు, ప్రత్యేకంగా రూపొందించిన ‘బోర్డ్ గేమ్స్’ (Board Game) త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయని వెల్లడించారు.
అఫీషియల్ మర్చండైజ్ సేల్స్ ప్రత్యక్షంగా అందుబాటులోకి రాకముందే అభిమానుల కోసం ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు. ఆసక్తి ఉన్నవారు మేకర్స్ విడుదల చేసిన అధికారిక వెబ్సైట్ ([varanasimovie.com](https://www.google.com/search?q=https://varanasimovie.com)) సందర్శించి ముందస్తుగా ‘వెయిటింగ్ లిస్ట్’ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ లిస్ట్‌లో జాయిన్ అయిన వారికి మర్చండైజ్కు సంబంధించిన అప్డేట్లు అందరికంటే ముందుగా చేరడమే కాకుండా, వెబ్సైట్ అవతలి వైపు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ కూడా కాచుకుని ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ వినూత్నమైన ప్రమోషన్ కాన్సెప్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతుంది.
Also Read
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
BOB
V-Neck
Rama Piramid
Board game….Hello from the world of #Varanasi…. Official Merchandise will be unveiled in the coming days. But before we get there… join the waiting list and be the first to know when it goes live!!! 😉
Something special might just be waiting for you…
— Varanasi (@VaranasiMovie) August 9, 2026
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!