రాష్ట్రంలో దశ దిశలేని పాలన : సోము వీర్రాజు

రాష్ట్రంలో దశ దిశ లేని జగన్‌రెడ్డి పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని కడతామని చంద్రబాబు ఓడిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్‌ వైజాగ్‌ పారిపోయాడు.. 2024లో బీజేపీకి అధికారాన్ని ఇస్తే రూ.10వేల కోట్లతో మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు ఇచ్చినా ప్రధాని మోడీ ఏపీకి రూ.50 వేల కోట్లను ఇచ్చారని చెప్పారు.

Read Also: మహారాష్ట్రలో జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత

రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో పరిశ్రమ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో ట్రెండింగ్‌ సృష్టిస్తుంటే జగన్‌ కలరింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేసుకుంటున్నాడని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్‌ పరిపాలనపై దృష్టి పెట్టాలని ఆర్భాటాలపై కాదన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేశారని సోము వీర్రాజు జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Related Articles

Latest Articles